జూన్ 26, 2026
TRINETHRAM NEWS

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి.!

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 14 : సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆస్తులమ్మి రాజకీయాలు చేస్తున్నామని పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తలు పార్టీ హక్కును చేర్చుకుంటుందన్నారు. పదవులు రాలేదని ఎవరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నారు. కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి బ్లాక్ అద్యక్షులు డివిజన్ అధ్యక్షుల నియామకాల కోసం దరఖాస్తులను శనివారం మూసాపేట్ లోని పార్టీ కార్యాలయంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ఆధ్వర్యంలో సేకరించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ దుర్గం భాస్కరరావు, కూకట్పల్లి నియోజకవర్గ పరిశీలకురాలు పారిజాత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ పార్టీ నాయకులు ప్రజాక్షేత్రంలో ఉండాలని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరుగు తాయని నాయకులు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అధిష్టానం దరఖాస్తుల పరిశీలన అనంతరం డివిజన్ బ్లాక్ అధ్యక్షులను ప్రకటించడం జరుగుతుందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Never sought political positions

You cannot copy content of this page