Press Club : ఇరుపక్షాలు కలిపి. మాట్లాడుకోవాలి

TRINETHRAM NEWS

తేదీ : 14/06/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ ప్రెస్ క్లబ్ ను అందరి ప్రెస్ క్లబ్ గా మార్చేందుకు న్యాయ పోరాటం చేస్తున్న ప్రెస్ క్లబ్ సాధన సమితి ఆధ్వర్యంలో గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు .పార్థసారదని కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ విషయంపై ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడు కోవాలని, అందుకు మేము మీ అందరిని పిలిపిస్తామని అనడం జరిగింది. విలేకరులందరూ కలిసి ఉండాలని, జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.

ప్రెస్ క్లబ్ అందరిదైతే విజయవాడ జర్నలిస్టులందరకు మేలు జరుగుతుందని, అమార్ధంవంతమైన నాయకత్వంతో భద్రతా సంక్షేమ ఏర్పడుతుందని, సాధన సమితి సభ్యులు మంత్రికి వివరించారు. ఆయన స్పందించి అడిషనల్ సెక్రటరీ అనితకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వీర్ల .శ్రీరామ్ యాదవ్, కూర్మ ప్రసాద్ బాబు, కె. నమ్మయ్య, ఏ వివి శ్రీనివాసరావు, మండవెల్లి మహేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Both sides should come

You cannot copy content of this page

Scroll to Top