మోడీ ప్రభుత్వ 11 సంవత్సరాల పాలనపై బిజెపి కార్యాలయం
మోదీ పాలనలో దేశానికి ప్రత్యేక గుర్తింపు-:నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు, కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలో మండల మొదటి కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు దోనాదుల మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏండ్ల పాలన సందర్భంగా బిజెపి కడ్తాల్ మండల కార్యశాల జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు
త్రినేత్రం న్యూస్ హాజరయ్యారు. ఆయన మోదీ 11 ఏండ్ల పాలన విజయాలను వివరించారు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014 నుంచి 2025 వరకు దేశానికి ప్రధానిగా సేవలు అందిస్తున్నారనీ ఈ కాలంలో పేదల అభివృద్ధికి మరియు దేశాభివృద్ధికి అనేక పథకాలు అమలు చేయడం జరుగుతుంది ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రతి వ్యక్తికి 5 కేజీల ఉచిత బియ్యాన్ని కారోనా వచ్చినప్పటినుండి ఫ్రీగా అందిస్తున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ కి దక్కుతుంది.
నిరుపేద కుటుంబాలకు వంట గ్యాస్ (LPG) కనెక్షన్ మహిళల ఆరోగ్యం, సమయం మరియు వాతావరణం పరిరక్షణ కోసం ఎంతో ప్రయోజనకరం.కోట్లాది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ వచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ కి దక్కింది దేశ ప్రజల కోసం స్వచ్ఛభారత్ అభియాన్ ముద్ర బ్యాంక్ స్కిల్ ఇండియా మిషన్ పీఎం విశ్వకర్మ యోజన నోట్ల రద్దు ఆర్టికల్ 370 రద్దు ట్రిపుల్ తలాక్ రద్దు వంటి స్కీములను దేశ ప్రజలకు అందించడం జరిగింది కావున నరేంద్ర మోడీ 11 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి గురించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు చెప్పి చైతన్యపరిచి విధంగా కార్యాచరణను ఏర్పాటు చేయాలని వారు కోరారు ,ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు సాయిలాల్ నాయక్, రాష్ట్ర బీజేవైఎం అధికార ప్రతినిధి కాంటెకర్ భగీరథ, రంగారెడ్డి జిల్లా ఎస్పీ మోర్చా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రీశైలం గౌడ్, రంగారెడ్డి జిల్లా వికలాంగుల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జి బాలకృష్ణ గౌడ్, రాష్ట్ర నాయకులు రెడ్డి నాయక్, శంకర్ నాయక్ రవీందర్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి పొగాకు వెంకటేష్, సంతోష్ విక్రం చారి, మండల ఉపాధ్యక్షులు వెంకటేష్ యాదవ్, సిద్ది కుమార్ మరియు సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


