రైతుల అనుమతి లేకుండా ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణం చేపట్టొద్దు

TRINETHRAM NEWS

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు
త్రినేత్రం న్యూస్ బల్మూరు. అనంతవరం గ్రామంలో ఉమామహేశ్వర రిజర్వాయర్ లో భూములు కోల్పోతున్న రైతులు అనుమతి లేకుండా రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడాన్ని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు తీవ్రంగా వ్యతిరేకించారు.
అనంతవరం గ్రామంలో రిజర్వాయర్లు భూములు కోల్పోతున్న రైతులతో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆరు వెంకట్రాములు మాట్లాడుతూ. బల్మూరు అనంతవరం మైలారం అంబగిరి గ్రామాల రైతులు 2601 ఒక ఎకరాలు భూములు కోల్పోవాల్సి వస్తుందని ఇప్పటివరకు రైతాంగానికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సర్వేలు చేపట్టడం ఎవడు నీకు హక్కు ఇచ్చారని భూమి మా హక్కు అయితే ఇక్కడ సర్వేలు చేసే అధికారులకు ఏ హక్కు ఉందని వారు ప్రశ్నించారు. రైతులను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని రైతాంగమంతా తిరుగుబాటు ఉద్యమం చేపట్టాలని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వంలో 2017 భూసేకరణ చట్టాన్ని తీసుకువచ్చి బలవంతపు సేకరణ చేయడం ఆ చట్టానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమం చేయాలని అన్నారు. రైతులు తన యొక్క వేలిముద్ర తెల్ల పేపర్ మీద పెట్టనంతవరకు మీ భూమి భద్రంగా ఉంటుందని ఎప్పుడైతే తెల్ల పేపర్ మీద ముద్ర పెడతారు అప్పుడు మీకు భూములు కోల్పోవాల్సి వస్తుందని రైతులను వారు వివరంగా చెప్పారు.
ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణం చేపట్టే దానికంటే ఇక్కడ గొలుసు కట్టు చెరువులు రుసుల చెరువు రామగిరి చెరువు కొత్తచెరువు ఈ మూడు చెరువులలో ఆయకట్టు పెంచి నీటి నిలువను ఉంచి ఈ ప్రాంత రైతుల భూములకు సాగునీరు ఇచ్చిన వారవుతారని ప్రాజెక్టు చేపట్టడం వల్ల 2600 ఎకరాల భూములు కోల్పోకుండా కాపాడిన వారు అవుతారని స్థానిక ఎమ్మెల్యే సరోజ చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండా ఈ ప్రాంతంలో ఉండే చెరువులను రిజర్వాయర్గా మలిచి అభివృద్ధికి దోహదపడాలని వారు అన్నారు. లేనిచో వ్యవసాయ కార్మిక సంఘం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహులు అధ్యక్షులు ఆంజనేయులు తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్, వ్యాకాస నాయకులు నాగరాజు శివకుమార్ సైదులు రైతులు రాజేష్ అంతయ్య స్వామి శీను బంగారయ్య మహిళా రైతులు తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Do not undertake the

You cannot copy content of this page

Scroll to Top