ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.
దేవరకొండ జూన్ 10 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముదిగొండ రోడ్డు వద్ద పెద్దగట్ట 10మంది లబ్ధిదారులకు 13లక్షల రూపాయలు,అంబా భవాని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అందిస్తున్న 32 లక్షల రూపాయల విలువ గల నష్టపరిహార చెక్కులను 30మంది లబ్ధిదారులకు రెవెన్యూ , ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి పంపిణీ చేసిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ .
అనంతరం నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న వారి పునరావాసం కొరకు చింతపల్లి గ్రామం వద్ద నిర్మించ తలపెట్టిన ఆర్ అండ్ ఆర్ కాలనీ కోసం సేకరించిన భూములకు ఆయా రైతులకు ప్రభుత్వం నుంచి 84లక్షల రూపాయల విలువ గల నష్టపరిహారం చెక్కులను 09 మంది లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. భూ నిర్వాసితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్యాకేజ్ ద్వారా భూ నిర్వాసితులకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వారి జీవనోన్నతికి అవసరమైన సహాయ సహకారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ఈ ప్యాకేజ్ ద్వారా భూ నిర్వాసితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కీలక కార్యక్రమం న్యాయబద్ధతతో కూడిన అభివృద్ధి పునాది వేస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.. భూ నిర్వాసితుల కష్టాలను పరిష్కరించడంలో కీలక భూమిక పోషిస్తుందని, నిధుల పంపిణీ సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ పథకం విజయవంతం కావడంలో ప్రతి ఒక్కరి సహకారం ముఖ్యమని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయపడతామని హామీ ఇచ్చారు.
నక్కలగండి ప్రాజెక్టు రిజర్వాయర్ ముంపు నిర్వాసితులు అధైర్యపడవద్దని ప్రభుత్వం పరిహారం అందిస్తుందని అన్నారు. భూములు కోల్పోయి నష్టపరిహారం రాని రైతులకు, భూనిర్వాసితులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం,పునరావాసం కల్పిస్తుందని అన్నారు. అనంతరం నియోజక వర్గంలో నిర్మాణ దశలో ఉన్న వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పురోగతిపై వివిధ దశల్లో ఉన్న భూ సేకరణ పనుల పూర్తికి ఫారెస్ట్ అనుమతులు తదితర అంశాలపై నేడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్ మరియు ఫారెస్ట్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ SC భద్రు,EE నెహ్రూ నాయక్, రాములు నాయక్, యాదన్ కుమార్, సత్యనారాయణ ,SDC యూనిట్ -1 నీల,DFO రాజశేఖర్,RDO రమణా రెడ్డి,FDO సంగీత, ఇరిగేషన్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు , ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


