తేదీ : 09/06/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ నియోజకవర్గంలో టి డ్కో కాలనీ నుండి గుడ్లవల్లేరు మండలం కౌతవరం వరకు పదమూడు కిలోమీటర్ల మేర రూపాయలు 2.20 కోట్ల నిధులతో నూతనంగా ముప్ఫై మూడు కె. వి విద్యుత్ లైన్ ను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. విద్యుత్ సబ్ స్టేషన్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించి, బ్రేకర్ స్విచ్ ఆన్ చేసి నూతన సర్వీస్ లైన్ తో విద్యుత్ సరఫరా ప్రారంభించడం జరిగింది. విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూపాయలు నాలుగు కోట్లతో ప్రతిపాదనలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనంతరాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఇప్పటికీ సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి, ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసేమని తెలిపారు. త్వరలోనే విద్యుత్ శాఖ మంత్రి ఉన్నత అధికారులను కలిసి సమస్యలు పరిష్కారం అయ్యేలా నిధులు సాధించుకోస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ డబ్ల్యూ వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డు చైర్మన్ పి. రవి , డి సి. చైర్మన్ ఎం.సుబ్రమణ్యం , విద్యుత్ శాఖ ఏడి కిరణ్, డి. ఈ శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా నాయకులు పి. జగన్, టిడిపి నాయకులు పి. ఆంజనేయులు, వల్లభనేని బాబురావు, వెంకట్రావు, వి. శివప్రసాద్, కె. రామరాజు, పి. వెంకట్రావు, ఎ. రామ్మోహన్, టి. సుబ్బారావు, జి. రాంబాబు, వెంకటేశ్వరరావు, వి. నాగేశ్వరావు, చిట్టి బొమ్మ. నరసింహారావు, పి. నరసింహారావు, టి. చంద్రశేఖర రావు, వల్లభనేని, రంగబాబు , దివ్య, మురళి, పి. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


