ఈ వారం అన్న క్యాంటీన్ దాతలు జగ్గంపేట నియోజకవర్గంలో మహిళా శక్తి కమిటీ
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కాకినాడ జిల్లాజగ్గంపేట జూన్ 9: స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత మూడున్నర సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు జగ్గంపేట నియోజకవర్గం మహిళా శక్తి కమిటీ సభ్యులు ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ కు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ముందుగా మహిళా శక్తి సభ్యులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా అనంతలక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు రద్దు చేయడంతో ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం ఎక్కడికి అక్కడ టిడిపి నాయకులు కార్యకర్తల సహకారంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగా జగ్గంపేటలో కూడా గత మూడున్నర సంవత్సరాలుగా అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం మహిళా శక్తి కమిటీ సభ్యులు అందరూ కలిసి అన్నా క్యాంటీన్ అన్నదానం నిర్వహించామని మళ్లీ కూటమి ప్రభుత్వం జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ కు శంకుస్థాపన చేయడం జరిగిందని తొందర్లోనే ఏర్పాటు అవుతుందని అప్పటివరకు దాతల సహకారంతో కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలినాటి ధర్మానందకుమారి, నకిరెడ్డి సూర్యవతి, గుమ్మల్ల అనంతలక్ష్మి, ఎల్లాటి అమ్మాజీ, పాఠం శెట్టి వెంకటలక్ష్మి, గెద్దాడ సత్య వేణి, రాపాక లక్ష్మి, గొల్లవిల్లి శ్రీదేవి, చెక్కా మరియా, సుజాత, కడారి లక్ష్మి, తిప్పన సత్యవతి, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


