Trinethram News : కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతుల కోసం నూతనంగా ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి రైతుకు ఆధార్ కార్డు తరహాలో 14 అంకెలతో కూడిన విశిష్ట సంఖ్యను కేటాయించనున్నారు.
దీనిని యూనిట్ ఫార్మర్ ఐడీ అని పిలుస్తారు. దీని ద్వారా రైతులకు సంబంధించిన అన్ని వివరాలను డిజిటల్ రూపంలో ఒక దగ్గర భద్రపరుస్తారు. పథకాల అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు.
ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవడం ఎలా?
ఫార్మర్ రిజిస్ట్రీ కోసం మండల పరిధిలో భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డుకు లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ను అధికారులకు ఇవ్వాలి. రిజిస్టర్ మొబైల్ కు మూడు ఓటిపి రావడం జరుగుతుంది వాటిని వ్యవసాయ విస్తరణ అధికారికి తెలియజేయడం ద్వారా వాటన్నింటినీ ఎంట్రీ చేయడంతో 11 అంకెలతో కూడిన రైతు విశిష్ట సంఖ్య వస్తుంది.
కేంద్ర ప్రభుత్వ పథకాలకు తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం చేపట్టే వివిధ సంక్షేమ పథకాలకు రైతు విశిష్ట సంఖ్య కీలకం కానుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫసల్ బీమా యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు విడుదల కావాలంటే రాబోయే రోజుల్లో రైతు విశిష్ట సంఖ్య తప్పనిసరి. అదేవిధంగా పంటల బీమా, సబ్సిడీలు, మౌలిక వసతుల కల్పన వంటి వాటిని సమర్థవంతంగా అమలు చేయాలంటే ఖచ్చితమైన రైతుల డేటా అవసరమని కేంద్రం భావిస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ యూనిక్ ఐడి ద్వారా వ్యవసాయ శాఖ డిజిటలీకరణ లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపొందించారు.
ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి- ఏవో
మండలంలో దాదాపు 20వేల మంది రైతులు ఉన్నారు. ఇప్పటివరకు కేవలం2 వేల లోపు రైతులు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్నారు. భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయించుకోవాలి. రిజిస్ట్రీ చేయించుకోవడం వల్ల రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుకునేందుకు లబ్ధి పొందుతారు. అదేవిధంగా పథకాల ఫలాలు రైతులకే నేరుగా చేరే అవకాశం ఉంటుంది. ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోని యెడల రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


