MLA “Bathula” : డా.బి.ఆర్. అంబేద్కర్ యూత్ క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతకు ట్రోఫీ అందజేసిన ఎమ్మెల్యే “బత్తుల”

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, పల్లకడియం గ్రామం లో హోరాహోరీగా జరిగిన డా.బి.ఆర్. అంబేద్కర్ యూత్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు “బత్తుల బలరామకృష్ణ”

ఈ సందర్భంగా ఎమ్మెల్యే “బత్తుల బలరామకృష్ణ” మాట్లాడుతూ, యువత క్రీడల వైపు మొగ్గు చూపి శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందాలని, క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని అన్నారు. అంతే కాకుండా యువత ఎలాంటి చెడు వ్యసనాలకు లోనవకుండా ఉండేందుకు ఇలాంటి క్రీడా టోర్నమెంట్లు దోహదపడతాయని పేర్కొన్నారు. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఈ టోర్నీలో పాల్గొన్న ప్రతీ ఒక్క క్రీడాకారుడికి మున్ముందు భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు కలిగి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, ప్రజలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dr. B. R. Ambedkar Youth Cricket Tournament

You cannot copy content of this page

Scroll to Top