ప్రతిపక్ష నేతలపై దాడులు – ప్రజల వ్యతిరేకత ఉప్పొంగిన వాస్తవం
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గంలో జూన్ 4,2024 తారీఖు చరిత్రలో మరిచిపోలేని రోజుగా నిలిచింది. అదే రోజు రెండోసారి శాసనసభ్యుడిగా గెలిచిన, రామకృష్ణ రెడ్డి అసలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. విజయం వచ్చిన తొలి రోజు నుంచే ఆయన రాజకీయ ప్రత్యర్థులను, కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారు.
విపక్ష నాయకుల ఇళ్లపై రాత్రివేళ దాడులు చేయడం, వారిని బలవంతంగా ఎక్కడికో తీసుకువెళ్లి బంధించి, ఒత్తిడి చేసి సంతకాలను తీసుకోవడం వంటి చర్యలు సాగుతున్నాయి. ఇది సైకో మానసికతకు నిదర్శనమని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
వెన్నుపోటు దినం గ్రాండ్ సక్సెస్ – ప్రజల అద్భుత స్పందన
జూన్ 4న జరిగిన “వెన్నుపోటు దినం” కార్యక్రమానికి అనపర్తిలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు, రామకృష్ణ రెడ్డి వైఖరిపై తమ వ్యతిరేకతను బహిరంగంగా ప్రకటించారని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పేర్కొన్నారు. అయితే, అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశానికి తగిన స్పందన రాకపోవడం, కార్యకర్తలే హాజరుకాకపోవడం చూస్తే ప్రజల్లో గల నిరాశ, అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తున్నాయి అని ఎద్దేవా చేశారు.
వ్యక్తిగతంగా మాట్లాడితే తగిన ప్రతిస్పందన
“నువ్వు అసలైన సైకోవే. నీకు జగన్మోహనరెడ్డి, గురించి మాట్లాడే స్థాయి లేదు. దమ్మూ ధైర్యం ఉంటే మీ సీఎం చంద్రబాబుతో ఎన్నికల హామీల గురించి బహిరంగ చర్చ పెట్టుకో. మీరు ఇచ్చిన ‘సూపర్ 6 హామీల’పై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. నీ స్థాయి దిగజారుతోంది. నీ పార్టీ స్థాయి కూడా అదే రీతిలో పడిపోతోంది,” అంటూ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు.
అలాగే, “నన్ను వ్యక్తిగతంగా గానీ, నా కార్యకర్తల జోలికి గానీ వస్తే ప్రెస్ ముందుకు వచ్చి సమాధానం చెబుతాను. నా కుటుంబాన్ని, కార్యకర్తలని, వైసీపీ నాయకులని దూషించడానికి ప్రయత్నిస్తే ఊరుకోను. ఒకటి అంటే పది చెబుతాను. ఇకపై మాటలు జాగ్రత్తగా మాట్లాడు,” అంటూ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


