MLA Adireddy Srinivas : 9 నట్స్‌ ఆహార పదార్ధాలతో ఆరోగ్యం

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజమహేంద్రవరం : పోషక విలువలు కలిగిన 9 నట్స్‌ ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) అన్నారు. స్థానిక దానవాయిపేట పెట్రోల్‌ బంక్‌ పక్కన 9 నట్స్‌ పేరిట నూతనంగా ఏర్పాటు చేసిన మిల్లెట్స్‌ షాపును ఆయన ముఖ్య అతిధిగా హాజరై 9 నట్స్‌ నిర్వాహకులు వై సత్తియ్య నాయుడు, ఆర్‌సీ శేఖర్‌, టిఎన్‌టియూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్‌, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, 9 నట్స్ సృష్టికర్త కీర్తన తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ చిరు ధాన్యాలు.. ఇవి నిజానికి ఆరోగ్యాన్నిచ్చే సిరి ధాన్యాలన్నారు. మిల్లేట్స్‌.. కొన్ని రోజుల క్రితం వరకూ వీటిని సాధారణ ధాన్యాల్లానే చూసేవారని, కానీ… ఇప్పుడు హెల్త్‌ని కాపాడే గుళికల్లా చూస్తున్నారన్నారు. వీటిని కానీ, వాటితో తయారు చేసిన ఆహార పదార్ధాలను తినడం వల్ల ఎన్నోబెనిపిట్స్‌ ఉన్నాయన్నారు.

రోజురోజుకి వీటి గురించి పెరిగిన అవగాహన వల్ల నేడు వీటిని ఎక్కువగా వాడుతున్నారన్నారు. పురాతన కాలం నాటి ఈ మిల్లెట్స్‌ అనారోగ్యానికి కారణమయ్యే రోగాలను దూరం చేసే బుల్లెట్స్‌ల్లా పని చేస్తాయన్నారు. 9 నట్స్‌ నిర్వాహకులు వై సత్తియ్య నాయుడు, ఆర్‌సీ శేఖర్‌ మాట్లాడుతూ తమ షాపులో మిల్లెట్స్‌తో తయారు చేసిన బెల్లంతో తయారు చేసిన స్వచ్ఛమైన నేటి మిఠాయిలు, నమ్కీన్స్‌, కుక్కీస్‌, చాక్లెట్స్‌ అండ్‌ ప్రొటీన్‌ బార్స్‌, చిక్కీలు, ఉదయం పూట తయారు చేసుకునే వివిధ అల్పాహారలకు సంబంధించిన పిండి, రవ్వలు తదితర ప్రొడక్ట్స్‌ లభిస్తాయన్నారు. తమ వద్ద లభించే ప్రొడక్ట్స్‌లో మైదా ఉండదని, షుగర్‌ కంటెంట్‌ అస్సలు ఉండదన్నారు. 9989266661 నెంబర్లో సంప్రదించి ఆర్డర్లు ఇస్తే బల్క్‌గా సప్లై చేస్తామన్నారు. హోమ్‌ డెలివరీ కూడా చేస్తామన్నారు. త్వరలో మరిన్ని శాఖలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కాగా మిల్లెట్స్‌ ఆహార పదార్ధాలలో ఎన్నో పోషకాలు ఉన్నాయన్నారు. ఎక్కువగా ఫైబర్‌, ప్రోటీన్స్‌ ఉండడంతో పాటు గ్లూటెన్‌ ఫ్రీ ఫుడ్‌గా ఇది పాపులర్‌గా ఉందన్నారు. ఇందులో పిండి పదార్థాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయని, గ్లూటెన్‌ రహిత శాకాహారి ధాన్యంగా వీటిని చెప్పొచ్చన్నారు. వీటిలో ఫాస్పరస్‌, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Health with 9 Nuts Food

You cannot copy content of this page

Scroll to Top