Jogeswara, Leelakrishna met CM : ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే జోగేశ్వరరావు, వేగుళ్ళ లీలాకృష్ణ

TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ని బుధవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు మరియు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్, మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఆయన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నూతన పదవి బాధ్యతలు చేపట్టిన లీలాకృష్ణ కి చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ బాధ్యతలను మీరు సమర్థవంతంగా నిర్వర్తించి, రాష్ట్రంలో నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధికి మరింత పేరు తెచ్చే విధంగా కృషి చేయాలని ఆయన ఆశీర్వదించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jogeswara Rao, Vegulla

You cannot copy content of this page

Scroll to Top