జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను తీవ్రత చేస్తాం. -12 గంటల పని పెంపుపై AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ప్రకటన… కాకినాడ,జూన్,05: ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 12 గంటల పని పెంచుతూ రాష్ట్ర క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ఏఐటియుసి జిల్లా ప్రధాన ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ఖండిస్తూ గురువారం సాయంత్రం పత్రిక ప్రకటన విడుదల చేస్తారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కార్మికులపై కక్ష సాధింపు చర్యలు మొదలెట్టిందని, అధికారంలోకి రాగానే కార్మికుల పని గంటల పై మొండి వైఖరి ప్రదర్శిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తలకు, బడా కార్పొరేట్ వ్యక్తులకు అనుకూలంగా ఉండేందుకే నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయుటకు ముందుకు వెళ్తుందని, 8 గంటల పని దినాలు అమలు పోరాడిస్తాదించుకున్నామని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలని ఆయన అన్నారు.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కార్మికులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, ఈ రాష్ట్రంలో 12 గంటల పని దినాలు పెంపు తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకుంటే జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను తీవ్రతరం చేస్తామని ఆయన అన్నారు. కార్మిక పక్షపాతి అని చెప్పుకుంటూ నే మరోపక్క కార్మికులపై తుదిబండ మోపే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దుందుడికి చర్యగా పాలన కొనసాగిస్తున్నారని, అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తి కాగానే కార్మికులపై వేటు తగదని ఆయన అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక, కూలి పనులు చేసుకునే వారికి సొంత రాష్ట్రంలో పనులు లేక వలసలకు వెళ్లిపోతున్నారని ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అని ఆయన అన్నారు.
మరొకపక్క నిత్యవసర అధిక ధరలు రోజురోజుకు పెంచుతున్నారని, కరెంట్ బిల్లులు, ఇంటి పన్నులు, అనేక రకాలుగా పన్నులు విధిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని,ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 12 గంటలు పని పెంపు ఆలోచన తక్షణమే విరమించుకోవాలని, ప్రజా ప్రతినిధులు పని గంటలు పెంపుపై పునరాలోచన చేసి క్యాబినెట్లో లేబర్ కోడ్స్ ను వ్యతిరేకించి రద్దు చేయాలని ఆయన అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


