త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట, రైతుల సమయాన్ని, ఖర్చులను తగ్గించే లక్షంతో వ్యవసాయ యాంత్రీకరణలో పధకంలో 50 శాతం సబ్సిడిపై రైతులకు వ్యవసాయ పరికరాలను కూటమి ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట పట్టణంలో ఎంపిడిఒ కార్యాలయం నందు మండపేట మండలం నకు సంబంధించి రెండవ విడత గా మంజూరు అయిన 12 పవర్ టిల్లర్లు, 2 రోటో వేటర్లు ను గురువారం ఎమ్మెల్యే వేగుళ్ళ రైతులకు పంపిణీ చేశారు. యూనిట్ విలువ రూ.30.75 లక్షలకు గాను ప్రభుత్వం రూ.12.92 లక్షలు సబ్సిడి అందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మండపేట మండల అధ్యక్షులు కర్రి తాతరావు, మాజీ అధ్యక్షులు యరగతపు బాబ్జి, మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, వాదా ప్రసాదరావు, బొల్లి తారకరామారావు, పిల్లా తాతాలు, మేకా జేజిబాబు, గొడవర్తి ఎర్రబ్బు, అధికారులు ఎంపిడిఒ సత్యనారాయణమూర్తి, అగ్రికల్చర్ ఎ.ఒ కె.ఏసుబాబు, ఆయా గ్రామాల అగ్రికల్చర్ అసిస్టెంట్లు, తదితర్లు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


