రాబోవు బక్రీద్ సందర్భంగా పీస్ కమిటీ మీటింగ్ నిర్వహణ డిసీపీ పెద్దపల్లి కర్ణాకర్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు రాబోయే బక్రీద్ సందర్బంగా గోదావరిఖని ఏసీపీ పర్యవేక్షణ లో గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో గోదావరిఖని 1 టౌన్, గోదావరిఖని 2 టౌన్ మరియు రామగుండం సర్కిల్ పరిధిలోని ముస్లిం, హిందూ, క్రిస్టియన్ మత పెద్దల తో శాంతి సమావేశం (పీస్ కమిటీ) ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సమావేశం కు పెద్దపల్లి డీసీపీ పి. కర్ణాకర్ ముఖ్య అతిథులు గా హాజరై హిందూ, ముస్లిం మత పెద్దలతో మాట్లాడి పోలీసుల తరుపున సూచనలు, సలహాలను తప్పకుండా పాటించాలని డీసీపీ కోరారు. గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో హిందూ ముస్లిం సోదరులు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ముందుకు వెళుతున్నారని తెలిపారు. ఆయా మతస్తులు పండుగ సందర్భాల్లో అందరు కలిసి కుటుంబ సభ్యులుగా పాల్గొంటున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు
ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ బక్రీద్ సందర్భంగా పశువుల రవాణాలను అనుమతి లేకుండా వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ లేకుండా ఎటువంటి ఆవుల రవాణా చేయకూడదు పశువుల కాళేబరాలను, పశువుల వ్యర్ధాలను బయట పడేయకుండా మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసే డిస్పోజల్ వాహనాలు, కవర్ లలో మాత్రమే వేయాలి అనుమతి లేకుండా ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా బహిరంగ ప్రదేశాలలో పశువుల వధ చేసే వారిపై, మరియు పశువులను అక్రమంగా రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కొంతమంది యువత బక్రీద్ సందర్భంగా అతి ఉత్సాహంతో సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేసి అల్లర్లు గొడవలు పాల్పడే విధంగా కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
పశువుల అక్రమ రవాణా జరిగే అవకాశం ఉండే ప్రాంతాలలో విస్తృతమైన పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది అన్నారు పశువుల అక్రమ రవాణా జరుగుతుందని కొంతమంది చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని, తమంతట తాముగా వెళ్లి వాహనాలను ఆపడం గాని పరిశీలించడం గాని చేసి అనవసర ఉద్రిక్తతలకు కారణమైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఏదైనా సమాచారం ఉన్నట్లయితే స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ – 100కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు మత ఘర్షణల కలిగేలాగా సమస్యలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా, సోషల్ మీడియాలో మతాలను, కులాలను, ఒకరినొకరు కించపరుస్తూ గాని ,
లేనిపోని అబద్దపు పుకార్లను సృష్టించి ఎవరైనా సోషల్ మీడియా లో పోస్టులు పెడితే వారిపై సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ నిఘా ఉంటుంది సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు, ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా అభ్యంతరకర పోస్టులు వచ్చిన ప్రజలు అట్టి పోస్టులను చూసిన వెంటనే ప్రతిస్పందించకుండా, సంయమనం పాటిస్తు అట్టి పోస్టుల్లో నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని, సామాజిక మాధ్యమంల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని వాటిని ముందుగా ఎటువంటి సమాచారం తెలిసినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలి సూచించారు ప్రభుత్వ నిబంధనలు ఉల్లఘించి ఆవులు,
లేగదూడలను అమ్మినట్లయితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామన్నారు పండుగ సందర్భంగా ప్రజలు శాంతియుతంగా, ఒకరితో ఒకరు కలసిమెలసి ఉండాలి చట్టవ్యతిరేక కార్యకలాపాలు, ప్రజా శాంతికి భంగం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని గుర్తుంచుకోవాలి పండుగను సంతోషంగా మరియు ప్రశాంతంగా జరుపుకోవాలి ఈ సమావేశంలో గోదావరిఖని ఏ సి పి ఎం రమేష్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, గోదావరిఖని టౌన్ ఎస్ఐ లు రమేష్, భూమేష్, ఎన్ టి పి సి ఎస్ ఐ ఉదయ్ కిరణ్, రామగుండం ఎస్సై సంధ్యారాణి, హిందూ ముస్లిం క్రిస్టియన్ మత పెద్దలు మరియు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


