స్థానిక నేతల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభోత్సవం
అల్లూరిజిల్లా(అనంతగిరి) త్రినేత్రం న్యూస్ జూన్ 3: అనంతగిరి మండలం ఎగువశోభ పంచాయతీలో రేషన్ డిపోను ప్రారంభిస్తూ స్థానిక నేతలు సోమవారం ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. డిపో డీలర్ పాంగి రోజా, విఆర్వో సిహెచ్. రాజేశ్వరి సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు సిహెచ్.మురళి, జడ్పీటీసీ సభ్యులు దిసరి గంగరరాజు, సర్పంచ్ కొర్ర సింహాద్రి, పిసా కమిటీ చైర్మన్ పాంగి రాము పాల్గొన్నారు.
గత ప్రభుత్వ హయంలో గిరిజన ప్రాంతాలలో రేషన్ సరఫరా కోసం ప్రవేశపెట్టిన మొబైల్ వాహనాల విధానం పూర్తిగా విఫలమైందని నేతలు పేర్కొన్నారు. దూరప్రాంత గ్రామాలకు సరైన రవాణా సదుపాయాలు లేకపోవడం వల్ల పెద్దఎత్తున కోట రైస్ నిల్వలుగా మిగిలిపోయిందని, తీరా ప్రజలకు మాత్రం న్యాయం జరగలేదని విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై తీవ్ర ప్రతిఘటనలు వెల్లువెత్తాయని, ప్రజాధనాన్ని వృథా చేసిన విధంగా పథకం రూపుదిద్దుకున్నదని నాయకులు ఆరోపించారు.
అలాగే వాహనాల కొనుగోలులో భారీ అవినీతి చోటుచేసుకుందని, గుజరాత్‌కు చెందిన మాన్ ప్రాక్చర్ కంపెనీ నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసిన వాహనాలను అధిక ధరలుగా చూపించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మొబైల్ పంపిణీ విధానాన్ని రద్దు చేసి, సాంప్రదాయక రేషన్ పంపిణీ పద్ధతిని మళ్లీ ప్రవేశపెట్టారు. ఇది నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేస్తుందని, పథకాల పేరిట జరిగే అవినీతిని అడ్డుకునే దిశగా వేసిన సానుకూల అడుగుగా అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాంగి సందీప్ దొర, పాంగి లక్ష్మణ్, సిరికోడి ధర్మన్న, పాంగి చిన్న, కొర్ర రవి, వార్డు మెంబర్ చిట్టం సుజాత, సోములు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


