జూన్ 26, 2026
TRINETHRAM NEWS

గిరిజన అభ్యర్థులకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలి – జీపు జాత డిమాండ్

అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ జూన్ 3 : అల్లూరిజిల్లా అరకువేలి మండల కేంద్రంలో సోమవారం జరిగిన ఆదివాసీ గిరిజన సంఘం నిర్వహించిన బహిరంగ సభలో మెగా డీఎస్సీ విషయంలో గిరిజన అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జీపు జాత అరకువేలికి చేరగా, శరభగుడ గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ అధ్యక్షతన సభ జరిగింది. రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ. అశోక్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వి. మహేశ్వరరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ప్రత్యేక డీఎస్సీపై పట్టు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు గిరిజన ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, తాజాగా విడుదల చేసిన మెగా డీఎస్సీలో ఏజెన్సీ ప్రాంత పోస్టులను మినహాయించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంత అభ్యర్థులకే ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి, 100 శాతం గిరిజన అభ్యర్థులతో నియామకాలు చేపట్టాలని కోరారు. ప్రస్తుత డీఎస్సీలో గిరిజన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు.
క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవాలి జూన్ 4న జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ కల్పించే ఆర్డినెన్స్ జారీ చేయాలని, ప్రత్యేక డీఎస్సీపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే భవిష్యత్‌లో భారీ స్థాయిలో ఉద్యమాలు మోదలవుతాయని హెచ్చరించారు.
ఈ జీపు యాత్ర గిరిజన ప్రాంత నిరుద్యోగులలో చైతన్యం కలిగించేందుకు ఉపయోగపడుతుందని, అన్ని గిరిజన సంఘాలు ఐక్యంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నాయని నేతలు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ గిరిజన సమస్యలు పరిష్కారం కాకపోవడం విచారకరమని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జి. బుజ్జిబాబు, మాగన్న, సహదేవ్, రామారావు, ఆదివాసీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు చట్టు మోహన్, ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ కన్వీనర్ కిల్లో జగనాధం, కో-కన్వీనర్ అశోక్ కుమార్, గుజ్జెల సురేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు, పద్మాపురం యూత్ అధ్యక్షులు విజయ్, కేశవరావు, చిన్న తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Adivasi Tribal Association public

You cannot copy content of this page