14వ రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన

TRINETHRAM NEWS

Trinethram News : బాపట్ల భీమావారి పాలెం కోదండ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడిన 14వ రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన స్థానిక అలపర్తి ఎన్క్లేవ్ మచ్చవారి పాలెం రోడ్డు లో సంక్రాంతి సంబరాలు సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ గుంటూరు జిల్లా అన్నం సతీష్ ప్రభాకర్ ఆధ్వర్యంలో 14 రాష్ట్ర స్థాయి ఎడ్ల బలప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో 21 ఎడ్ల. జతలు పాల్గొన్నాయి. ఈ ప్రదర్శనను అన్నం సతీష్ మాజీ ఎమ్మెల్సీ ప్రారంభించారు. మొదటి బహుమతి విజేతలు: కుంచాల వేద లతా రెడ్డి పగడం వారి పాలెం చెరుకుపల్లి మండలంరూ. 30,000లు, రెండవ బహుమతి మరుప్రోలు చెన్నకేశవరెడ్డి, పోతురాజు కొత్తపాలెం బాపట్ల మండలం, రూ. 25,000లు, మూడవ బహుమతి గొర్ల యశ్వంత్, బోయినవారిపాలెం, రూ. 20,000లు, విజేతలకునగదు అందజేశారు. కాపు సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top