1530 మంది దగ్గర రూ.150 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్
Trinethram News : హైదరాబాద్ –చింతల్ పరిధిలోని సూర్యనగర్ లో ఉన్న రిడ్జ్ టవర్స్ లో పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే సంస్థ నిర్వహిస్తున్న మహారాష్ట్రకు చెందిన వడైగర్ బాలాజీ (35), తండ్లే చౌదరి స్వాతి (30), గతంలో ఎల్బీనగర్, అత్తాపూర్ లోనూ కార్యాలయాలను నిర్వహించిన నిందితులు
రూ.లక్ష డిపాజిట్ చేస్తే 16 నెలల్లో రెండింతలు ఇస్తామని నమ్మించి ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసిన నిందితులు.. ఒక్కొక్కరు రూ.50 లక్షల నుండి రూ.కోటి వరకు డిపాజిట్ చేయగా, వీరిలో కొంతమందికి అధిక వడ్డి చెల్లించిన నిర్వాహకులు.. దీంతో అధిక వడ్డీ రావడంతో వారి స్నేహితులు, బంధువులతో సైతం డిపాజిట్ చేయించిన బాధితులు .. 16 నెలల గడువు ముగిసినవారు గత రెండు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా డబ్బు చెల్లించని నిర్వాహకులు
ఈ నెల 30వ తేదీన దాదాపు 100 మంది బాధితులు కర్యాలయానికి చేరుకోగా, కార్యాలయం మూసివేసి ఉండడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు .. బాధితుల ఫిర్యాదు మేరకు నిర్వాహకుల్లో ఒకరైన స్వాతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


