ఎన్నికల వాగ్దానాల్లో ఇళ్ల స్థలాలు హామీలను తక్షణమే అమలు చేయాలి.
కాకినాడ,మే,29: భారత కమ్యూనిస్టు పార్టీ CPI ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఎస్. అచ్చుతాపురంలో స్థానిక అంబేద్కర్ స్టాట్యూ వద్ద సిపిఐ నగర కార్యదర్శి టి. అన్నవరం ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలపై జూన్ 2న జరిగే సిపిఐ నిరసన పోస్టర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ పోస్టల్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ప్రసాద్ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో పేద ప్రజలకు ఇళ్ల స్థలాల మంజూరు చేస్తామని, గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు భూమిని, అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు భూమిని మంజూరు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిందని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం పూర్తి అవుతున్న ఇక్కడికి ఆహామీలను నెరవేర్చలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పేద ప్రజలకు సొంత ఇల్లు లేక, ఇంటి అద్దెలు కట్టుకోలేక తీవ్రత ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన పట్టాలకు స్థలం చూపించాలని, 5 లక్షల రూపాయలు లోన్లు మంజూరు చేయాలని, అర్హులైన నిరుపేదలందరికీ కొత్త పట్టాలు మంజూరు చేయాలని, ఇళ్ల స్థలాలు మంజూరు పై ప్రజా ప్రతినిధులు స్పందించాలని, ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని, అర్హులైన పేద ప్రజలందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని, వృద్ధాప్య వితంతు పెన్షన్లను ఏ ఒక్కటి తొలగించకుండా పూర్తి స్థాయిలో అందరికీ అమలు చేయాలని, జూన్ 2వ తేదీన ఇళ్ల స్థలాలపై సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ఆందోళన చేపడుతామని ప్రసాదమన్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్, అచ్చారావు, ప్రసాద్, వీరబాబు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


