అల్లూరిజిల్లా(పాడేరు) త్రినేత్రం న్యూస్ మే 25: అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏ.ఏస్. దినేష్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ, అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఓట్ల స్ట్రాంగ్ రూమ్ లు తనిఖీ చేయడం జరిగింది.పాడేరు నియోజకవర్గంలోని పాడేరు మండల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీసు సిబ్బంది భద్రతతో నిల్వ ఉన్న ఓట్ల బాక్సులను వేరే భద్రమైన ప్రదేశానికి తరలించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియ కూటమి నాయకుల సమక్షంలో చేపడతామని, అందరూ హాజరై సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
కూటమి నాయకులు ఓట్ల బాక్సుల భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ తో కలిసి ఓట్ల బాక్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పాడేరు మండల అధ్యక్షుడు నందోలి మురళీకృష్ణ, బీజేపీ యూత్ ప్రెసిడెంట్ గోపాల్ పాత్రుడు మాట్లాడుతూ, ఓట్ల బాక్సులు తరలించే సమయంలో తమకు ముందుగా సమాచారం ఇవ్వాలని, తాము తప్పకుండా హాజరవుతామని తెలిపారు.
ఈ తనిఖీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్‌కు కూటమి నాయకులు ధన్యవాదాలు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్స్ పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాల్లోని భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ అధికారులతో కలిసి సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్వో పద్మలత, ఎంఆర్వో త్రినాథ్, రెవెన్యూ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


