MLA Jare : ములకలపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారె

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలంలో పర్యటించిన గౌరవ శాసనసభ్యులు జారె ఆదినారాయణ ముందుగా మాదారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు హక్కు పత్రాలు అందజేశారు. అనంతరం మండల కేంద్రంలో గల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో మండల విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయదారుల విశ్రాంతి భవనం నందు ప్రభుత్వం భూసార పెంపుదల కోసం 50 శాతం సబ్సిడీతో అందించే జనుము జీలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పర్యటనలో భాగంగా మండల కేంద్రంలో పల్లపు వెంకటేశ్వర్లు (లేటు) లక్ష్మీ దంపతుల కుమారుడు ప్రతాప్-శిరీషల వివాహ వేడుక మరియు పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద జరిగిన పలు వివాహ వేడుకలలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు (మాజీ) తాండ్ర ప్రభాకర్, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్ మరియు వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jare visited Mulakalapalli

You cannot copy content of this page

Scroll to Top