గోదావరిఖని మే 23-//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణలో ప్రతిష్టాత్మక కంపెనీ అయిన సిరుల తల్లి సింగరేణి లో సుమారు 35సంవత్సరాలు సుదీర్ఘ సేవలు అందించి అందరితో మన్ననలు పొంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ల చేతుల మీదుగా హైదరాబాద్ లో శ్రమ శక్తి అవార్డు అందుకున్న దేవుల పల్లి రాజేందర్, అరుగంటి కృష్ణ లను శుక్రవారం ఐఎన్టియుసి కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఆర్జీ1 సిఎస్పి, ఏరియా వర్క్ షాప్ లో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు.
భవిష్యత్తులో మంచి అవార్డులు అందుకుని, సంస్థకు మంచిపేరు తీసుకురావాలని అధికారులు పేర్కోన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న సీనియర్ కార్మికుల సూచనలు, శ్రమశక్తి అవార్డు గ్రహీతలను యువ కార్మికులు ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు అన్నారు. జాయింట్ జనరల్ సెక్రటరీ బత్తుల పోషం, బ్రాంచ్ కమిటీ నాయకులు బూర జగన్, ఏరియా వర్క్ షాప్ పిట్ సెక్రటరీ, పిట్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏరియా వర్క్ షాప్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా పాల్గోన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


