ఇంటింటికీ రేషన్ అందిస్తున్న మా పొట్టకొట్టొద్దు
ఎండియు వాహనాలను రద్దు జీవో ఉపసంహరించుకోవాలి
ప్రభుత్వానికి ఎండియు ఆపరేటర్ల విజ్ఞప్తి
కలెక్టర్ ఆఫీసు వద్ద ఆందోళన
కలెక్టర్ ప్రశాంతికి వినతిపత్రం ఇచ్చిన అసోసియేషన్ అధ్యక్షుడు ఆరే చిన్ని
Trinethram News : రాజమహేంద్రవరం : ప్రజలకు ప్రతినెలా సక్రమంగా ఇంటింటికీ రేషన్ అందచేస్తున్న ఎండియు ఆపరేటర్ల వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని ఎండియు ఆపరేటర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాము తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారంతా డిమాండ్ చేశారు.2027 వరకు కొనసాగేందుకు తమకు గడువు ఉన్నప్పటికీ రాష్ట్ర మంత్రిమండలి తమపై వేటు వేస్తూ అర్థాంతరంగా నిర్ణయం తీసుకోవడం అన్యాయమని వారంతా ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకుశ్రీ అన్నపూర్ణ రాజమహేంద్రవరం అర్బన్ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరిజిల్లాలోని ఎండియు ఆపరేటర్లు బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి తమ నిరసన తెలియజేశారు.అనంతరం వారంతా కలెక్టర్ పి.ప్రశాంతిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఆరే చిన్ని మాట్లాడుతూ తమ కుటుంబాలను రోడ్డున పడ వేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా 9,260:రైస్ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ వాహనాలను 201జనవరి 27 న నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం తమను తీసుకుని 6 సంవత్సరాల వరకు పని కల్పిస్తూ జీవో జారీ చేసిందని చెప్పారు.జూన్ 1 నుంచి రేషన్ డిపోల ద్వారా రేషన్ ఇవ్వాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం తమ పొట్ట కొట్టడం దారుణమని ఆరే చిన్ని వాపోయారు.కరోనా సమయంలో కూడా తాము ప్రాణాలను ఫణంగా పెట్టి రేషన్ అందించామని ఆయన చెప్పారు.9,260 ఎండియు ఆపరేటర్లు,తమకు ఒక అసిస్టెంట్ వెరసి కుటుంబానికి ఐదుగురు వంతున లక్షమంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నామని ఆయన తెలిపారు.
అందుకే ఈ జీవోపై పునఃపరిశీలన చేసి ఉపసంహరించుకోవాలని ఆరే చిన్ని డిమాండ్ చేశారు.తమ సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని ఆరే చిన్ని కోరారు.ఎండియు ఆపరేటర్ పి.ఇందిర మాట్లాడుతూ ప్రభుత్వం తమకు అప్పగించిన పనిని సక్రమంగా, బాధ్యతతో అమలు చేస్తున్నామని, అర్థాంతరంగా తమను తొలగిస్తూ జీవో జారీ చేయడం తగదని అన్నారు.వృద్ధులు, వికలాంగులకు ఇంటికి వెళ్ళి మరీ రేషన్ ఇస్తున్నామని ఆమె చెప్పారు.తమ సేవలు కొనసాగించాలని ఇందిర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో అసోసియేషన్‌గౌరవాధ్యక్షుడు గారా త్రినాథ్,గౌరవ సలహాదారు నక్కా శ్రీను, ఉపాధ్యక్షుడు గూటం రాజు సుదన్ సింగ్, కార్యదర్శి వనుము సూర్య దొర తేజ,సహాయ కార్యదర్శి చొడవరపు దుర్గా ప్రసాద్, కోశాధికారి కటారి సతీష్, సభ్యులు గేదెల రామమూర్తి,గెద్దాడ అనిల్ కుమార్,కనకం రవి కుమార్,విప్పర్తి యోహాన్ రాజు,నందిగాన సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


