Youth Conference : సోషల్ మీడియా – యువసమ్మేళనం. విస్తృత స్థాయి సమావేశం

TRINETHRAM NEWS

దేవరకొండ మే 20 త్రినేత్రం న్యూస్. ఈరోజు అనగా 20-05-25 మంగళవారం రోజు దేవరకొండ నియోజకవర్గ సోషల్ మీడియా-యువ సమ్మేళనం విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్.
ఈసందర్భంగా ఎం ఎల్ ఏ మాట్లాడుతూ… ఓపిక ఉన్నంత వరకు కాదు ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవే నా లక్ష్యం. సోషల్ మీడియా సైనికులే కాంగ్రెస్ పార్టీకి అసలైన బలం, బలగం. కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ పట్టుకొమ్మ లాంటిది. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ప్రతి యువజన కాంగ్రెస్ నాయకులు పని చేయాలి. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే మన లక్ష్యం. ప్రభుత్వ పథకాలను పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని అన్నారు.
దేవరకొండ* పట్టణంలోని సాయి రమ్య ఫంక్షన్ హాల్ లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవరకొండ నియోజక వర్గ సోషల్ మీడియా – యువ సమ్మేళనం విస్తృత స్థాయి సమావేశంలో ఎం ఎల్ ఏ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యూత్ కాంగ్రెస్ సైనికుల పాత్ర అమోఘం. యువజన కాంగ్రెస్ నాయకులు చేస్తున్న నిరంతర శ్రమ, కృషి వల్లే ప్రజల్లో పార్టీపై నమ్మకం పెరుగుతుంది అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సోషల్ మీడియా వేదికగా నియోజక వర్గ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలి అని అన్నారు.

రైతు రుణమాఫీ, సన్న బియ్యం,200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కు గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,యువత కోసం రాజీవ్ యువ వికాసం,ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్కిల్ యూనివర్సిటీ లాంటి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేయబడుతుంది వీటిని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా,యూత్ కాంగ్రెస్ ,కార్యకర్తలు గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి, ప్రతి కార్యకర్త ఈ విషయాలు ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నారు…

కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా నాయకత్వాన్ని బలపరిచే దిశగా ముందుకు సాగాలి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఓ మహాసముద్రం లాంటిది. ఇందులో పనిచేసిన వారందరికీ నిస్సందేహంగా గుర్తింపు, గౌరవం, సరైన పదవులు లభిస్తాయి అని తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి సోషల్ మీడియా కార్యకర్త కంకణబద్ధుడై పనిచేయాలని పిలుపునిచ్చారు. యూత్ కాంగ్రెస్ నాయకులకు ఏ బాధ్యత ఇచ్చిన పార్టీకి కట్టుబడి పనిచేస్తే అవకాశం ఉన్నచోట సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది అన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు,యువజన కాంగ్రెస్ నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శిలు,మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, NSUI నాయకులు, కార్యకర్తలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Social Media - Youth Conference

You cannot copy content of this page

Scroll to Top