Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబుకి వినతి పత్రం అందజేసిన సిఎంఓఏఐ

TRINETHRAM NEWS

గోదావరిఖని మే-20// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి అధికారుల సమస్యల ప్రధానమైన వేతన బకాయిల్లో పిఆర్పి 2022 – 23 సంవత్సరపు బకాయిలు చెల్లించాలని, సింగరేణి ఇతర ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యుత్, ఐఐటి, ఐఐఎం ఫీజు రీఎంబర్స్మెంట్ అధికారులకు కూడా వర్తింపజేయాలని మంగళవారం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి శ్రీధర్ బాబును సిఎంఓఏ ఐ ఆధ్వర్యంలో సింగరేణి అధికారులు కోరారు.

సింగరేణి అధికారుల సంఘం తీర్మానం మేరకు ప్రజాప్రతినిధులకు సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు అందజేయాలనే నేడు అర్జీ-3 లో జరిగిన కార్యక్రమంలో సమస్యలు పరిష్కరించాలని మంత్రిని సింగరేణి అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో అధికారుల సంఘం తరుపున బిఈసి సెంట్రల్ పెద్ది నర్సింహులు జనరల్ సెక్రెటరీ, వైస్ ప్రెసిడెంట్ పొనుగోటి శ్రీనివాస్ ఇతర ఏరియా ల ప్రతినిధులు పాల్గోన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CMOAI submits petition to

You cannot copy content of this page

Scroll to Top