పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం మే-20// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బసంత్ నగర్ టోల్ ప్లాజా వద్ద లారీ యజమానులు పెద్ద ఎత్తున మహా ధర్నా నిర్వహించారు. 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లారీలకు ఎలాంటి టోల్ వసూలు చేయవద్దంటూ హెచ్ కె ఆర్ యజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా హెచ్ కె ఆర్ యజమాన్యాన్ని స్తంభింపజేసి టోల్ వసూల్ ను నిలిపివేశారు. గత రెండు రోజుల నుంచి టోల్ ప్లాజా వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ఈరోజు పెద్ద ఎత్తున లారీ యజమానులు ప్లాజా వద్ద వంటా వార్పు కార్యక్రమం నిర్వహించి, నిరసన కార్యక్రమం చేపట్టారు.
12 ఏళ్ల నుంచి నిరంతరం టోల్ వసూలు చేస్తున్న హెచ్ కే ఆర్ యజమాన్యం హైవేపై కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం లేదన్నారు. టోల్ వసూలు మాఫీ చేయకుంటే నిరవధిక నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దీంతోపాటు హైవే రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్లు, గ్రీనరీ, ఆంబులెన్స్, రెస్ట్ రూమ్స్, మెడికల్ ఏర్పాటు చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు లారీ యజమానుల సంఘం నాయకులు శ్రీనివాస్ రెడ్డి,బయ్యపు మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు.పాలకుర్తి మండల్ అధ్యక్షులు ముక్కెర శ్రీనివాస్. మరియు రామగుండము లారీ యజమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


