తేదీ : 18/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , గుడివాడ , దేశ సేవ చేసి రిటైరైన సైనికులు సమాజ ఉన్నతిలో భాగస్వామ్యం చేసేలా, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ,కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని ఎమ్మెల్యే వెనిగండ్ల. రాము పేర్కొన్నారు.
రాజేంద్రనగర్ లో ఆయన స్వగృహంలో పలువురు విశ్రాంత సైనికులు ఎమ్మెల్యేను కలిశారు. ఆయన పలు అంశాలపై మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నా తండ్రి వెంకటేశ్వర రావు ఆర్మీలో పని చేశారని కుటుంబం నుండి వచ్చిన నాకు రిటైరైన తర్వాత వారి కష్టాలు తెలుసుకున్నారు.
దేశ రక్షణలో విశేష సేవలు అందించి ధైర్యానికి ప్రతిరూపాలైన సైనికులను మనమందరం ప్రత్యేకంగా గౌరవించుకోవాలన్నారు. ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహించి రిటైరై నటువంటి సైనికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకునేలా, వారి సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. సమాజ ఉన్నతిలో భాగస్వామ్యులు అయ్యేలా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మాట్లాడుతాను అన్నారు. ఎమ్మెల్యే రాముతో జరిగిన సమావేశంలో పలువురు ఆర్మీ విశ్రాంత సైనికులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


