ఎయిర్ బేస్ లో జవాన్లను అభినందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
Trinethram News : మీరంతా చరిత్ర సృష్టించారు.. పాక్ కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సత్తా చూపారంటూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులను ప్రధానమంత్రి మోడీ ప్రశంసించారు. ఈ సందర్భంగా వీరులను చూసినప్పుడు జీవితం ధన్యమవుతుందని మోడీ అన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం అణ్యాయుధాల బూచి చూపి బ్లాక్‌మెయిల్ చేయాలనుకున్నారు.. కానీ అణుబాంబు హెచ్చరికలను భారత్ చిత్తు చేసింది.. భారత్ మాతాకీ జై అనే నినాదం ప్రపంచమంతా వినిపిస్తోంది.. భారత్ మాతా కీ జై నినాదం శత్రువులకు నిద్ర లేకుండా చేసిందని ప్రధాని మోడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులను ప్రశంసించారు.
భారత వాయుసేన ప్రతిభను చూసి ప్రపంచం ఆశ్చర్యపోయిందని భవిష్యత్ కాలానికి మీరు ప్రేరణగా నిలుస్తారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారత ఆర్మీ, నేవీ, వాయుసేనలు పాక్ సైన్యాన్ని గడగడలాడించాయి.. మన డ్రోన్స్, మిస్సైల్స్ పాకిస్తాన్ వాళ్లకు నిద్రలేకుండా చేశాయి.. మహారాణా ప్రతాప్ గుర్రం చేతక్ గురించి రాసిన కవితను వినిపించిన ప్రధాని.. ఈ కవిత మన ఆయుధాల సామర్థ్యానికి కూడా వర్తిస్తుందని.. భారత స్వాభిమానాన్ని కొత్త శిఖరాలకు చేర్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


