Cattle Herder Died : పిడుగుపాటుకు పశువుల కాపరి మృతి

TRINETHRAM NEWS

అరకువేలి మండలం, మడగడ పంచాయతీ పరిధిలో విషాదం

అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ మే 14: అరకువేలి మండలంలోని మడగడ పంచాయతీకి చెందిన మంజగూడ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం తీవ్ర విషాదం నెలకొంది. సమర్డి దోంబు (63), పశువుల కాపరి, తన పశువులను మేయించి ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. దురదృష్టవశాత్తూ పిడుగు సమర్డి దోంబుపై పడడంతో పాటు ఆయనతో ఉన్న ఒక ఆవు కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Cattle herder dies due

You cannot copy content of this page

Scroll to Top