Trinethram News : టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి అక్రమ కేసులో విచారణకు పిలిచారు. బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చాను. ప్రజాస్వామ్యంలో పట్టాభిలాగా బూతులు మాట్లాడరు. దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం. మాట్లాడే సమయంలో సంయమనంతో ఉండాలి. మీరు అడిగేవి ఏదీ నాకు తెలియదని చెప్పాను.
ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఎన్నికలకు ముందునుంచే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, సంతకాలు పెట్టమని బెదిరించడం, జైలుకు పంపిస్తున్నారు. చంద్రబాబు నుంచి కిందిస్థాయి వరకూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు వ్యవహరిస్తున్నారు. కంతేరు ఎంపీటీసీ అయిన మహిళ పట్ల కూడా దురుసుగా ప్రవర్తించారు.
పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు. రేపు మేం అధికారంలోకి వచ్చి ఇలాగే మొదలుపెడితే ఎలా ఉంటుంది. మీరు వేసిన విత్తనం చాలా ప్రమాదకరమైనది. పోసాని ఎప్పుడో మాట్లాడితే కేసు పెట్టారు.
సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటికి ఎలాంటి అనుమతి లేకుండా పోలీసులు వెళ్లారు. ఇలాంటి ఉన్మాద చర్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఆలోచించండి. మీరు ఎంతమందిని జైలులో పెడతారు. లిక్కర్ స్కాం కూడా తప్పుడు కేసే. ఏడాది దాటింది… ఇప్పటికైనా వాస్తవంలోకి రండి… లేకపోతే జనం తరిమికొట్టే రోజులు వస్తాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


