జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 15 at 3.50.45 PM

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీకాకుళం…

ఒకరు మృతి సుమారు 30 మంది యాత్రలకు గాయాలు

పలాస మండలం మొగిలిపాడు సమీపంలో జాతీయ రహదారిపై పండగపూట ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును వెనుక నుంచి మరో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ఘటనా స్థలంలో మృతి చెందగా… సుమారు 30 మంది యాత్రికులు గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న 108, 1033 అంబులెన్స్లలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నేషనల్ హైవే సిబ్బంది ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తూ… క్రేన్ సహాయంతో వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం అనుపూర్ జిల్లాకు చెందిన సుమారు 150 మంది యాత్రికులు రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులలో పూరి దర్శనం అనంతరం అన్నవరం దర్శనానికి వెళుతుండగా.

పలాస మండలం మొగిలిపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న మరుగుదొడ్లను యాత్రికులు వినియోగించుకునేందుకు బస్సు రహదారిపై డ్రైవర్ ఆపడంతో.. ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న కాశీబుగ్గ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటన పై కేసు నమోదు చేశారు.

You cannot copy content of this page