Simhapuri Steelman : సింహపురి స్టీల్ మెన్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: మే 8: నెల్లూరు జిల్లా: కావలి మిస్టర్ సింహపురి స్టీల్ మాన్, బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ , 2025 కు సంబందించిన పోస్టర్స్ ను కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, బుధవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ జూన్ 22వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి కావలి పట్టణంలోని బృందావనం కాలనీ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వ్యాయామంలోనే నవజీవన ప్రమాణాలు చిగురిస్తాయని, క్రమశిక్షణ మన జీవనాన్ని మారుస్తుందని, వ్యాయామం మన జీవితాన్ని మారుస్తుందన్నారు.

మనిషి జీవితంలో ఆరోగ్యం ఎంత ముఖ్యమో అలాంటి ఆరోగ్యం మన సొంతం కావాలంటే మనం నియమ నిష్టలతో – ప్రణాళికా బద్దంగా ఆహారం వ్యాయామం కొనసాగించడం ద్వారా అందమైన శరీర సౌష్టవము ఆరోగ్యకరమైన జీవనంతో ముందుకు కొనసాగి జీవన ప్రమాణాలు పెరిగి ఉల్లాసంగా జీవితాన్ని సాగించగలమన్నది యదార్ధ సత్యమన్నారు. ఎవ్వరైనా డబ్బు సంపాదించటం తేలికే కానీ ఆరోగ్యాన్ని పొందటం అంత తేలికైన పనికాదన్నారు. కఠోరదీక్ష,సమయపాలనతో కూడిన వ్యాయామంతో అది సుసాధ్యమన్నారు.

వ్యాయమంతో వచ్చే ఆరోగ్యం వల్ల చక్కటి శరీర సౌష్టవం కలిగి మనసు ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండి ఎటువంటి అనారోగ్యాలను దరిచేరనివ్వదన్నారు. ప్రతి మనిషికి నేను ఫిట్ గా ఉన్నాను అనే భరోసా, భావన కల్గిస్తున్నది వ్యాయామం ఒక్కటే అని తెలిపారు. వ్యాయామం , ఆరోగ్యం నినాదంతో జూన్ 22న మన కావలి పట్టణంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వ్యాయామ ప్రదర్శన కనువిందు చేయబోతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కె. మాధవరెడ్డి, ఆర్గనైజర్స్ సెక్రటరి బి. జగన్, తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Simhapuri Steelman

You cannot copy content of this page

Scroll to Top