మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలనకు ప్రజలకు ఎంతో సేవలుఅందిస్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శుల సమస్యల ను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ గ్రామ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ అధ్యక్షుడు ఏ శ్రీకాంత్ గౌడ్ ప్రధాన కార్యదర్శి నాగరాజు అధ్యక్షుడు సందీప్ గురువారం ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ని కలిసి తమ సమస్యలను వివరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న నిర్వహించే రాష్ట్ర స్థాయి పంచాయతీ కార్యదర్శుల సదస్సుకు రావాల్సిందిగా ఆయన ను ఆహ్వానించారు. గతంలో వికారాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలలో పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ కోసం మంత్రిగా మహేందర్ రెడ్డి సహకరించిన విషయాన్నీ గుర్తు చేస్తూ ప్రస్తుతం తమకున్న సమస్యలను ప్రభుత్వానికి వివరించేందుకు మరో మారు సహకరించాలని వారు మహేందర్ రెడ్డిని కోరారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నాలుగు సంవత్సరాల కాలం పూర్తి చేసుకొని గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శి గా క్రమ బద్ధీకరించ బడిన వారి సర్వీస్ లో ఏడాది సేవా కాలం పూర్తి అయినందున ప్రభావిత తేదీని ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయాలని అందుకు మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కు వివరించాలని వారు మహేందర్ రెడ్డి ని కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్లు లేని గ్రామ పంచాయతీలకు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించి, సామాజిక తనిఖీల్లో పంచాయతీ కార్యదర్శులకు బాధ్యులు చేయరాదని వారు కోరారు.
క్రీడా కోటాలో ఎంపికైన 98 మంది జిపిఎస్ లను తొలగించిన నేపథ్యంలో వారిని సర్వీసులోకీ తీసుకొని క్రమబద్ధీకరణ చేయాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. వారి సమస్యలను విన్న మహేందర్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తానని వివరించారు. ప్రభుత్వ సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి, మంత్రి సీతక్కతో చర్చిస్తామని సమస్యను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి ల దృష్టికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శులు సేవలను ఆయన కొనియాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి,ఫలాలను ప్రజలకు, నిరుపేదలకు, రైతులకు, యువతకు, మహిళలకు అందేలా చూడాలని ఆయన వారికి సూచించారు. పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రవిశెట్టి, ప్రధాన కార్యదర్శి సంజీవ కుమార్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


