Threatening Call : మీ ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తాం’

TRINETHRAM NEWS

తిరుపతి వ్యక్తికి పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్

Trinethram News : పగడాల త్రిలోక్‌ కుమార్‌కు పాక్ నుంచి బెదిరింపు కాల్ – వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన బాధితుడు..

పాకిస్థాన్‌కు చెందిన అధికారి పేరిట తిరుపతికి చెందిన వ్యక్తికి ఓ ఫోన్‌కాల్‌ రావడం కలకలం రేకిత్తించింది. తిరుపతికి చెందిన పగడాల త్రిలోక్‌ కుమార్‌ స్థానికంగా గాజుల వ్యాపారం చేస్తుంటారు. బుధవారం నాడు ఉదయం ద్విచక్ర వాహనంపై తిరుమలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో 92 32925 27504 నంబర్​ నుంచి ఆయనకు ఫోన్‌ వచ్చింది.

కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి ‘మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు. జాగ్రత్తగా ఉండండి. లేకుంటే మీ ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తాం’ అని త్రిలోక్ కుమార్​ని ఫోన్​లో హెచ్చరించారు. దీంతో వెంటనే ఆయన డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. దీనిపై సీఐ రామ్‌కిషోర్‌ స్పందిస్తూ పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి ఫోన్‌ చేసి మాట్లాడినట్లు తెలుస్తోందని చెప్పారు. దర్యాప్తు అనంతరం పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని సీఐ పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We will bomb your

You cannot copy content of this page

Scroll to Top