బిక్కవోలు: త్రినేత్రం న్యూస్, పందలపాక, మరియు కొంకుదురు రైతు సేవా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే, నల్లమిల్లి.
ధాన్యం కొనుగోలు విధానంలో క్రింద స్ధాయి అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే, నల్లమిల్లి మండిపాటు
తాను ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి టార్గెట్లు పెంపొందింప చేస్తుంటే క్రింద స్ధాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతుల ఇబ్బందులు తొలగకపోవడంపై నల్లమిల్లి ఆగ్రహం.
ఇటీవల పౌరసరఫరాల శాఖా మంత్రి మరియు కలెక్టర్లతో జరిగిన మీటింగ్ లో ధాన్యం కొనుగోలు అంశంలోని లోపాలపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడిన ఎమ్మెల్యే, నల్లమిల్లి ఉన్నతాధికారులను ఒప్పించి అనపర్తి నియోజకవర్గంలో ధాన్యం సక్రమంగా కొనేలా ఏర్పాట్లు చేయించారు. అయితే రైతు సేవాకేంద్రాలలోని ఉద్యోగులు పై అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా రైతులకు ఇక్కట్లు ఏమాత్రం తగ్గడం లేదని సమాచారం అందడంతో ఈరోజు ఆయన బిక్కవోలు మండలం పందలపాక, మరియు కొంకుదురు రైతు సేవా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసారు.
ఈ సందర్భంగా టార్గెట్లు లేవని రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయకుండా వెనక్కి పంపుతున్న వైనాన్ని గుర్తించి ఉద్యోగులను నిలదీసారు. వారిచ్చిన సమాచారంతో పై అధికారులకు పోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతు తీసుకువచ్చిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాను టార్గెట్లు పెంచేలా జెసి మరియు ఇతర పై అధికారులను ఒప్పిస్తుంటే మీ నిర్లక్ష్యం కారణంగా అవి అమలు కావడం లేదని నల్లమిల్లి వారిని హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


