కొత్తపేట:త్రినేత్రం న్యూస్, ఉగ్ర శిబిరాల ధ్వంసం మన సైనిక సత్తాకు నిదర్శనమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ధీమా వ్యక్తంచేశారు. భారత సైన్యం పాకిస్థాన్ కు సరైన గుణపాఠం చెప్పిందని ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గ్రామంలో జాతీయ జెండాలతో ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహిల్గాం మారణకాండకు భారత్ పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపి విజయవంతంగా వాటిని ధ్వంసం చేసిన తీరు భారతీయులకు గౌరవాన్ని తెచ్చిపెట్టిందని అన్నారు.
ఈ ఆపత్కాల సమయంలో భారతీయులందరూ ప్రభుత్వానికి అండగా నిలబడి సైనికులకు మనోధైర్యాన్ని కల్పిద్దామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలి, ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని ఎమ్మెల్యే సత్యానందరావు పిలుపునిచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


