Twins Die : వాట్సప్ వీడియో కాల్ వైద్యం వికటించి.. గర్భంలోనే కవలల మృతి

TRINETHRAM NEWS

Trinethram News : పెళ్లైన ఏడేళ్ల తర్వాత సంతానం కలగబోతోందని ఆనందపడ్డ ఆ తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చిన వాట్సప్ వైద్యం .. ఆసుపత్రికి వచ్చిన గర్భిణికి వైద్యం చేయాలని నర్సుకు మరెక్కడో ఉన్న వైద్యురాలు వాట్సప్ వీడియో కాల్ ద్వారా సూచించడంతో వికటించిన వైద్యం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఘటన.. ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామానికి చెందిన బుట్టి గణేశ్, కీర్తిలకు ఏడేళ్ల కిందట వివాహం జరిగినా.. సంతానం కలగక పోవడంతో ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆసుపత్రిలో డాక్టర్ అనూషారెడ్డి దగ్గర వైద్యం చేయించుకున్న దంపతులు

ఈ క్రమంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న కీర్తికి నొప్పులు రావడంతో అదే ఆసుపత్రికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు.. ఆ సమయంలో వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో.. డాక్టర్ వాట్సప్ వీడియో కాల్ ద్వారా చేసిన సూచనల మేరకు గర్భిణి కీర్తికి ఇంజక్షన్లు ఇచ్చి చికిత్స చేసిన నర్సు

దీంతో వైద్యం వికటించి గర్భంలో ఉన్న ఇద్దరు మగ శిశువులు మృతి.. అనంతరం చికిత్సకు రూ.30 వేలు చెల్లించాలని బాధితులను డిమాండ్ చేసిన ఆసుపత్రి యాజమాన్యం.. మీ నిర్లక్ష్యం వల్లే కవల శిశువులు మృతి చెందారు.. పైగా మమ్మల్నే డబ్బులు చెల్లించమంటున్నారు అంటూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు

ఇప్పటికే సంతానం కోసం రూ. 15 లక్షల వరకు ఖర్చు చేశామని.. కవల పిల్లలు పుడుతున్నారని తెలిసి సంతోషంగా ఉన్న సమయంలో ఇలా వైద్యురాలి నిర్లక్ష్యంతో దారుణం జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన.. దీంతో ఆసుపత్రికి వచ్చి వివరాలు తెలుసుకుని ఆసుపత్రిని సీజ్ చేసిన జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

WhatsApp video call disrupts

You cannot copy content of this page

Scroll to Top