Mother Sale Son : ఆటో కోసం కన్న కొడుకును అమ్మేసిన కసాయి తల్లి

TRINETHRAM NEWS

Trinethram News : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బూస లావణ్య అనే మహిళకు నర్సింలు అనే వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది, వీరికి ఇద్దరు పిల్లలు (ఒక బాబు, పాప) ఉన్నారు.. కొంత కాలం క్రితం నర్సింలు అనారోగ్యంతో మృతి చెందగా, లావణ్య బట్టల దుకాణంలో పనిచేస్తూ పిల్లలను పోషిస్తుంది

ఈ క్రమంలో లింగంపేట మండలం పర్మళ్ళ గ్రామానికి చెందిన చాకలి సాయిలతో లావణ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది, ఈ విషయం తెలిసి సాయిలు భార్య అతన్ని వదిలేసి వెళ్ళడంతో కామారెడ్డిలో కూలి పనిచేస్తూ లావణ్యతో సహజీవనం చేస్తున్నాడు

వీరికి ఆదాయం సరిపోవట్లేదని ఉపాధి కోసం ఆటో కొందామని, ఇందుకు లావణ్య కొడుకు నిఖిల్ (5)ను విక్రయించేందుకు సిద్ధం అయ్యి, పర్మళ్ళ గ్రామానికి చెందిన నసీమా అనే మహిళకు రూ.50 వేలకు బాలుడిని అమ్మేశారు.. నసీమా బాలుడిని తన చెల్లి షహీదాకు ఇవ్వగా, షహీదా ఆ బాలుడిని రూ.1 లక్షకి శేఖర్ అనే వ్యక్తికి విక్రయించింది..

ఈ విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ అధికారుల ఫిర్యాదు మేరకు, బాలుడిని బాల సంరక్షణ కేంద్రానికి తరలించి లావణ్య, సాయిలు, నసీమా, షహీదా, శేఖర్ లపై కేసు నమోదు చేసిన పోలీసులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Butcher's mother sells her

You cannot copy content of this page

Scroll to Top