MLA Gorantla : రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు కాపాడుతున్న సీఎం సహాయ నిధి

TRINETHRAM NEWS

కూటమి ప్రభుత్వం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్న ఎమ్మెల్యే గోరంట్ల

రాజమండ్రి : త్రినేత్రం న్యూస్ : రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు కాపాడేందుకు సీఎం సహాయనిది ఎంతగానో ఉపయోగపడుతుందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు ఉదయం గోరంట్ల వారి కార్యాలయం నందు దామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పెనుమాక వీర వెంకట సత్యనారాయణ మూర్తికి 2,18,400/- రూపాయలు, సాటిలైట్ సిటీ గ్రామానికి చెందిన పెంకె చంద్రశేఖర్ కు 35000/- రూపాయలు, ధవలేశ్వరం గ్రామానికి చెందిన గ్రంధి సుజాతకు 50000/- రూపాయలు, రాజవోలు గ్రామానికి చెందిన బూరిగ మంగకు 20000/- రూపాయలు మొత్తం కలిపి 3,23,400/- రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించారు.

ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారి ఆరోగ్యం పట్ల భరోసా కల్పించి, అండగా నిలబడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఉదారంగా ఆలోచించి, రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అనేక మంది పేద ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ మండలం తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర నాయకులు మార్గాన్ని సత్యనారాయణ, చెల్లిబోయిన శ్రీనివాస్, నిమ్మలపూడి రామకృష్ణ, వారా రాము, పిన్నింటి ఏకబాబు, యర్రమోతు ధర్మరాజు, ఆళ్ల ఆనందరావు, సావాడ శ్రీనివాస్ రెడ్డి, గాలి వెంకటేశ్వరరావు, చాపల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Relief Fund is

You cannot copy content of this page

Scroll to Top