Illegal Building Case : కోర్టులో నడుస్తుంది అక్రమంగా కట్టిన బిల్డింగ్ కేసు

TRINETHRAM NEWS

తేదీ : 05/05/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం పట్టణంలో కన్యకా పరమేశ్వరి సత్రం కి ఏర్పాటుచేసిన కరెంట్ విషయంపై అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రిసిటీ) వారికి కంప్లీట్ చేయడం జరిగింది. నగర పంచాయతీ తొమ్మిది వ వార్డు కౌన్సిలర్ దుర్గారావు. నడిబొడ్లు లో 198/1 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి సత్రం ప్రదేశంలో అక్రమంగా కట్టిన బిల్డింగ్ విషయం కోర్టులో నడుస్తుంది. నగర పంచాయతీ నుండి కమిషనర్ చార్టు సీట్ దాఖా లు చేయడం జరిగింది.
దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. అలాంటి అక్రమ కట్టడం బిల్లింగ్ కు కరెంటుతో పాటు ట్రాన్స్పరును ఏర్పాటు చేశారు. ఎటువంటి అనుమతులు లేని ఈ బిల్డింగ్ కు మీరు ఎలా కరెంటు ఇచ్చారని ప్రజా సమస్యల పరిష్కార వేదికగా అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కి రిప్రజెంట్ ఇవ్వటానికి వచ్చామన్నారు. ఒక పేదవాడు కరెంట్ మీటరు పెట్టుకోవాలంటే ఎన్నో ఆధారాలు అడుగుతారు. ఎటువంటి ఆధారాలు , అనుమతులు లేని ఒక అక్రమ కట్టడం బిల్డింగ్ కు కరెంట్ ని కట్ చేయాలని కోరుకున్నమని తెలిపారు. లేనిచో ఉన్నతాధికారులకి ఈ సమస్యను తీసుకెళ్లి దీనిపై శాఖపరమైన చర్యలు తీసుకునేదాకా మేము వెనకడుగు వెయ్యమని, దుర్గారావు కోరడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

An illegal building case

You cannot copy content of this page

Scroll to Top