దేవరకొండ మే 04. త్రినేత్రంన్యూస్. నల్లగొండ జిల్లా దేవరకొండ డివిజన్ పరిధిలోని చందంపేట మండలంలోని ముడుదండ్ల గ్రామంలో గత మూడు రోజుల నుండి నిర్వహిస్తున్న బొడ్రాయి ప్రతిష్ట ,ముత్యాలమ్మ ప్రతిష్ట, ఈదమ్మ విగ్రహ ప్రతిష్ట, మరియు ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంగణంలో ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. శుక్రవారంతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు సోమవారం బోనాల కార్యక్రమాలతో ముగియ నున్నాయి .శనివారం రోజున ఉదయం 9 గంటల నుండి గణపతి పూజ, వ్యాపి వాచనం, అఖండ దీప స్థాపన, యాగశాల ప్రవేశం ,మండవ ఆరాధనలు, మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణములు, సాయంత్రం నాలుగు గంటల నుండి విగ్రహముల గ్రామోత్సవము ఊరేగింపు నిర్వహించబడినది. శనివారం రోజున సామూహిక హోమాలు, విగ్రహములకు మపస్నా పణము, మంగళహారతి, తీర్థప్రసాద వితరణములు, నిర్వహించారు.
బ్రహ్మశ్రీ డాక్టర్ నూరి నారాయణమూర్తి ఆధ్యాత్మిక ప్రవచనములు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన, ప్రజా ప్రతిష్టాపనము, కాలన్యాసము, ప్రాణ ప్రతిష్ట, బలి పూర్ణాహుతి, మహా కుంభాభిషేకం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడినది. ఆదివారము నిర్వహించబడిన ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ట, బొడ్రాయి ప్రతిష్ట, ఈ దమ్మ ప్రతిష్ట ,ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభన ప్రతిష్ట, కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమములు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ,శంకర్ నాయక్, లోక్యా నాయక్, హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజా కార్యక్రమాలు, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ,ప్రధాన పూజారి శ్రీనివాస్ శర్మ, గ్రామ పూజారులు రాఘవేందర్ శర్మ, వంశీ శర్మ ,మరియు 11 మంది పూజారిలతో నిర్వహించబడినవి. తెలుగు పల్లి గ్రామ మహిళ కోలాట బృందం చే నిర్వహించబడిన కోలాటం భజన భక్తులను విశేషంగా ఆకట్టుకున్న ది. ఆదివారం నిర్వహించబడిన అన్నదాన కార్యక్రమానికి ధాతగా దామెర వెంకటయ్య దంపతులు వ్యవహరించారు. గ్రామ కమిటీలో భాగంగా కార్యక్రమాలకు పందిరి ప్రతాపరెడ్డి ,ఇప్ప గోపాల్ రెడ్డి, ఎదురు సత్తిరెడ్డి ,లోకసాని నారాయణరెడ్డి, పందిరి శేఖర్ రెడ్డి ,ఏమి రెడ్డి లక్ష్మారెడ్డి ,శ్రీధర్ రావు, యాసాని రాజవర్ధన్ రెడ్డి ,జక్కుల జంగయ్య మున్నయ్య , పందిరి విష్ణువర్ధన్ రెడ్డి, దామెర శ్రీనివాసులు, పందిరి మధుకర్ రెడ్డి ,అన్నపాక నిరంజన్, జంగయ్య, చిలుకాని మునిందర్ రెడ్డి, పందిరి శ్రీనివాస్ రెడ్డి, మా రెడ్డి కృష్ణారెడ్డి ,ఇతరులతో కూడిన గ్రామ కమిటీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈదమయ్య బృందం చే భక్తి గీతాలు ఆలపించారు .పెద్ద ఎత్తున మహిళా భక్తురాలు పాల్గొని తమ మొక్కులను తీర్చుకున్నారు. బంధుమిత్రులతో ముడుదండ్ల గ్రామం కోలా హలంగా మారింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


