అల్లూరి సీతారామరాజు జిల్లా, త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 5 ; జి మాడుగుల మండలంలోని పిన లోచిలి మరియు చింతలగొంది గ్రామాల్లో జన్ జీవన్ సంఘ్ ఆధ్వర్యంలో లీగల్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా సంఘ్ అధ్యక్షులు కె. అప్పాజీ మాట్లాడుతూ మోటార్ వెహికిల్ చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరమని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్, వాహన బీమా వంటి వ్యవస్థలను కలిగి ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ పి. మహేష్ బాబు, ఫోక్సో చట్టం (పెద్దలచే చిన్నారులపై జరిగే లైంగిక దాడుల నిరోధక చట్టం) గురించి గ్రామస్తులకు వివరించారు. అలాగే, పార్టీ జనరల్ సెక్రటరీ జీ. సురేష్ మాట్లాడుతూ ఐటీడీఏ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాలసీ మూర్తి, గ్రామ యువత, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో యువత కోసం యూత్ క్లబ్, రైతుల కోసం రైతు క్లబ్‌లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంచేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం ప్రశంసనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


