జూన్ 26, 2026
TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే : కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షపాతి అని వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. 139వ ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా గురువారం కేపీహెచ్బీ కాలనీ టెంపుల్ బస్టాప్ వద్ద మేడ్చల్ జిల్లా ఐఎన్టీయూసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఫణి కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఏఐటీయూసీ పతాకాన్ని ఆయన స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ నాటి స్వాతంత్రం నుండి కాంగ్రెస్ పార్టీ పేదల కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసిందని కార్మికుల కోసం చేసిందన్నారు.

రాష్ట్రంలో హెచ్ఎంటి, ఎన్ ఎఫ్ సి, హెచ్ సి ఎల్, హెచ్ ఏ ఎల్, బి హెచ్ ఈ ఎల్, డి ఆర్ డి ఓ వంటి ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేసి వేల మంది కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఉపాధి అవకాశాలను కల్పించిందన్నారు. కార్మికులకు నిరంతరం అందుబాటులో ఉండే సంజీవరెడ్డి పి జనార్దన్ రెడ్డి కార్మిక నేతలుగా మంచి గుర్తింపు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, నరసింహారెడ్డి, శంకర్, బచ్చు మళ్ళీ, శివ చౌదరి, పి ఆర్ నాయుడు, కోటి, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, వెంకటరావు, శివ, సంధ్యారాణి, సరోజినీ, వనజ, వరలక్ష్మి, యమునా, శృతి ,భాగ్యలక్ష్మి, దివ్య, విజయలక్ష్మి, రాజేశ్వరి ,ఆదిలక్ష్మి, అపర్ణ, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The Congress party will

You cannot copy content of this page