World Workers’ Day : కావలి పట్టణంలో ని లత ,సినిమా థియేటర్ సమీపంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :మే 1: నెల్లూరు జిల్లా : కావలి పట్టణంలో లతా సినిమా హాల్ థియేటర్ సమీపంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్బంగా గురువారం కార్మికులు మేడే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే .దాగు మాటి కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిది గా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే ను కార్మికులు శాలువాలు కప్పి పుష్పగుచ్చములు ఇచ్చే ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన కార్మికుల జండా ను ఆవిష్కరించారు.. అనంతరం కార్మికులు పడుతున్న కష్టాలను వివరించారు. కార్మికులందరూ గ్రూపుగా ఏర్పడి ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు. కార్మికులకు వెళ్లిన ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబానికి మీరు కట్టిన ఇన్సూరెన్స్ ఆధారమవుతుందన్నారు.

అన్ని వృత్తుల లో భవన నిర్మాణ వృత్తి ఎంతో విలువైనదన్నారు. ఎంత ధనికుడైన నివసించాలంటే ఇల్లును కార్మికుడు కట్టివ్వాల్సిందేనన్నారు. అలాంటి కార్మికులందరికీ అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. నేను ఎమ్మెల్యేను అయినా కూడా మిమ్మల్ని అందరిని కాపు కాసుకునే ఒక కార్మికుడిని అన్నారు. నిరుపేద కుటుంబం పుట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కొని కష్టపడి పని చేసుకుంటూ అంచలంచెలగా ఎదిగి నేడు ఎమ్మెల్యేగా మీ అందరికీ సేవ చేసుకుంటున్నాను అన్నారు. కాబట్టి కార్మికుల కష్టం తెలుసునన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కార్మికులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో తెలుసునాన్నారు. కావలిలో కార్మికులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

World Workers' Day near

You cannot copy content of this page

Scroll to Top