-కార్మికుల సంక్షేమమే లక్ష్యమన్న వాసంశెట్టి గంగాధర్
Trinethram News : రాజమహేంద్రవరం : మే డే సందర్భంగా ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్, రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు వాసంశెట్టి గంగాధర్ రావు ఆధ్వర్యంలో నగరంలో గురువారం సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోట గుమ్మం నుంచి డీలక్స్ సెంటర్ వరకు ఈ ర్యాలీ జరిగింది. కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసంశెట్టి గంగాధర్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణకు నిరంతరం ఐఎన్టియుసి కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్మికుల బలోపేతం, కార్మిక సంక్షేమం, వారి కుటుంబాల అభ్యున్నతి ఐ ఎన్ టియుసి తోనే సాధ్యమవుతుందని అన్నారు. కార్మికులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వారికి ఐఎన్టియుసి తరఫున అండగా నిలబడి వారి హక్కుల సాధనకు పోరాటం చేయడానికి తాము ఎల్లప్పుడు సిద్దంగా ఉంటామని వెల్లడించారు. మేడే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ది రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్, క్వారీ వర్కర్స్ యూనియన్, హార్లిక్స్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్, ఎనో సాల్ట్ వర్కర్స్ యూనియన్, నేషనల్ లారీ వర్కర్స్ యూనియన్, కోస్టల్ పేపర్స్ వర్కర్స్ యూనియన్, క్వారీ లారీ వర్కర్స్ యూనియన్, సింగిల్ లారీ వర్కర్స్ యూనియన్ సహా వివిధ ఆటో వర్కర్స్ యూనియన్ల సభ్యులు, కార్మిక నాయకులు, ఆటో స్టాండ్ ల డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


