శ్రీశ్రీ జయంతి సందర్భంగా వీసీ సందేశం
Trinethram News : కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అదీ చేతకాకపోతే పాకుతూ పో అంతే కానీ.. ఒకే చోట అలా కదలకుండా ఉండిపోవద్దు అంటూ శ్రీ శ్రీ సమాజాన్ని చైతన్య పరుస్తూ వ్రాసిన అక్షరాలు అస్త్రాలుగా పని చేస్తున్నాయని వీసీ ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ అన్నారు. బుధవారం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో శ్రీ శ్రీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ప్రిన్సిపల్ ఆచార్య డి జ్యోతిర్మయి శ్రీ శ్రీ చిత్రపటానికి పువ్వులు వేసే నివాళులర్పించారు. శ్రీ శ్రీ జయంతి సందర్భంగా వీసీ ప్రసన్న శ్రీ సందేశాన్ని విద్యార్థులకు తెలియజేశారు. తెలుగు సాహితీ లోకంలో శ్రీ శ్రీ ఓ సంచనలం. తూటాల్లాంటి మాటలతో ఆకలి రాజ్యంపై రక్తాక్షరాలు చిందించిన శ్రీ శ్రీ తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేశారు.
“నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను.. భువన భవనపు బావుటానై పైకి లేస్తాను” అంటూ తన కవితల మహాప్రళయంతో మహోగ్రజ్వాలగా మారిన శ్రీ శ్రీ.. బానిస బతుకుల గొంతుకై ఆధునిక సాహిత్యంలో విప్లవాన్ని సృష్టించారు. యువత శ్రీ శ్రీ సాహిత్యాన్ని చదివి చైతన్యవంతులై లక్ష్య సాధనకు కృషి చేయాలని వీసీ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ కోర్సు కోఆర్డినేటర్ డా.డి. లక్ష్మీనరసమ్మ, విభాగ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


