తేదీ : 29/04/2౦25. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం , మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయక నిధి చె క్కుల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే రాష్ట్ర గృహ నిర్మాణ , పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారధి. ఆయా గ్రామాలలో పర్యటించి మే రెండవ తేదీన అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం నుండి సుమారు ఇరవై వేల మందిని అమరావతి ప్రాంగణంలో జరిగే సభను విజయవంతం చేయడానికి తీసుకువస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెప్పాను అని అన్నారు.
పోలవరం మరియు తదితర గ్రామాల పర్యటించి మోదీ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సభ లో పాల్గొని ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కులు ఎవరికైతే వచ్చాయో వాళ్లకు అందజేయడం జరిగింది. వచ్చినవారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా, రాకుండా మండల ప్రభుత్వ అధికారులు, మరియు కూటమి నాయకులు చూసుకోవడం జరిగింది.
గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం చెరువులు నీళ్లు లేక ఎలా ఎండిపోతా యో అదేవిధంగా రాష్ట్రం కూడా అలా ఉందని అన్నారు. ఇప్పుడు యన్ డి యే కూటమి వచ్చిన తర్వాత చెరువుల్లో నీరు ఎండలేదు, రాష్ట్రం ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తున్నామని అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని తెలిపారు.
సభకు వచ్చినటువంటి వాళ్లు ఎవరికైతే సమస్య ఉందో వినతి పత్రాల ద్వారా మంత్రికి అందజేశారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి అధికారులు, ప్రజలు, సంతోషాన్ని మరియు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు మరియు టిడిపి మండల నాయకులు బట్టు. లక్ష్మణరావు, యం పి పి లంకా. నిర్మల వారి సిబ్బం టిడిపి జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శులు మో రంపూడి. శ్రీనివాసరావు, బసవ రెడ్డి కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి విందు భోజనాలు ఏర్పాటు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


