త్రినేత్రం న్యూస్. కడియం మండలం బుర్రిలంక గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన పి కొండరత్నం, ఎం.త్రివేణి కుటుంబాలను రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరామర్శించి అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల స్థానిక కూటమి నాయకులు ఏర్పాటు చేసిన 30000/- రూపాయలు తన సొంత నిధులు 10000/- రూపాయలు, మొత్తం 40000/- రూపాయలను బాధిత కుటుంబాలకి అందించారు.
అలాగే నిరాశ్యులైన కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఇల్లు నిర్మించుకునేందుకు హౌసింగ్ లోన్ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, సర్పంచ్ పాఠంశెట్టి రాంజీ, వెలుగుబంటి రఘురాం, గట్టి సుబ్బారావు, బోడపాటి గోపి, పంతం గణపతి, గెడ్డం శివ, వారా రాము, మార్గాని ఏడుకొండలు, సత్తి వెంకటగిరి, కోమలి రామకృష్ణ, నునే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


