నియోజకవర్గంలో జలధార పేరుతో తాగునీటి కష్టాలను తీర్చుతున్న నారా లోకేష్
తాగునీటి ఇబ్బందులు ఉన్న చోట జలధార పేరుతో అత్యధునాతన మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తున్న నారా లోకేష్
తాజాగా తాడేపల్లి సుందరయ్య నగర్ లో రూ 3 లక్షలతో 5వ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు
5వ మినరల్ వాటర్ ప్లాంటును ప్రారంభించిన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు
ప్రజా నాయకుడు ఎలా ఉండాలి అన్న దానికి నిలువెత్తు నిదర్శనం నారా లోకేష్
—బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, నందం అబద్దయ్య
తాడేపల్లి టౌన్, జనవరి 14: నారా లోకేష్ సొంత నిధులతో తాడేపల్లి పట్టణం మహానాడు 18వ రోడ్డులోని సుందరయ్య నగర్ లో రూ. 3 లక్షలతో ఏర్పాటు చేసిన అత్యధునాతన మినరల్ వాటర్ ప్లాంటును తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకవేశ్వరరావులు టీడీపీ, జనసేన నాయకులతో కలిసి ఆదివారం ఉదయం ప్రారంభించారు. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం పట్ల సుందరయ్య నగర్ నివాసితులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నారా లోకేష్ నియోజకవర్గంలో జలధార పేరుతో తాగునీటి కష్టాలను తీర్చుతున్నారని అన్నారు. తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న ప్రజలకు సురక్షిత మంచినీరు ఉచితంగా అందించేందుకు నారా లోకేష్ జలధార పేరుతో మొత్తం 5 మినరల్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్లాంట్ నిర్వహణకు ఆపరేటర్‌ను కూడా నియమించడం జరుగుతుందన్నారు. అధికారంలో లేనప్పటికీ నారా లోకేష్ నియోజకవర్గ ప్రజలకు చేరువగా ఉన్నారని అన్నారు. టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద ప్రజల అభివృద్ధికి నారా లోకేష్ కృషి చేయాలని కోరారు. ఒక్క అవకాశమంటూ గద్దెనెక్కి, గాలి మాటలతో ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపుదామన్నారు. గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రజలకు సేవ చేయకుండా వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్ళిపోతే ఓటమి చెందిన లోకేష్ నియోజకవర్గ ప్రజలకు అవసరమైన అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. పక్కనే సీఎం జగన్ ఇళ్లు ఉన్నప్పటికీ పేద ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. టీడీపీ – జనసేన అభ్యర్థులను గెలిపించుకొని మంగళగిరి నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకుందామని అన్నారు. నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య మాట్లాడుతూ నారా లోకేష్ సమాజమే దేవాలయం.. ప్రజలే నా దేవుళ్ళు’ అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో నారా లోకేష్ నియోజకవర్గ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు నిరంతరం ప్రజల పక్షాన జగన్ ప్రభుత్వం మీద పోరుడుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏకపక్షంగా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలు సిధ్దమయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, తాడేపల్లి రూరల్ మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు, మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, మంగళగిరి రూరల్ అధ్యక్షులు తోట పార్థసారథి, దుగ్గిరాల మండల అధ్యక్షురాలు కేసంనేని శ్రీఅనిత, దారా దాసు, గోవాడ దుర్గారావు, షేక్ రియాజ్, కారంపూడి అంకమ్మరావు, మేకా పుల్లారెడ్డి, కాటబత్తుల నిర్మల, గోర్ల వేణుగోపాల్ రెడ్డి (7), అద్దంకి మురళీ, అన్నె కుసుమా, బెజ్జం రామకృష్ణారావు, ఎం ఈశ్వరి, మాళవిక, బెజ్జం కుమార్, కుర్రాపాటి విజయ్ కుమార్, దర్శి హరికృష్ణ, ఇట్టా భాస్కర్, గాదె శ్రీనివాసరావు, చిన్నపోతుల చిన్నా, షేక్ నాగుల్ మీరా, పఠాన్ జానీఖాన్, షేక్ నాగుల్ మీరా(మందడం), కాటం ఆంజిరెడ్డి, సంక్రాంతి అశోక్, ఏడుకొండలు, షేక్ సైదా, దోనకొండయ్య, హనుమంతు, చిన్న బచ్చియ్య, కోగంటి వెంకటేశ్వరరావు, నరేష్ అడపా, దుర్గారావు, కొర్రపాటి నాగరాజు, తాళ్లూరి శ్రీను, షేక్ ఇలియాజ్, తాడిబోయిన గోపి, ఎండి అమీర్, గాజుల శ్రీను, జి అంకాలరావు, భాగ్యలక్ష్మి, బుర్రముక్కు శ్రీనివాసరెడ్డి, షేక్ బుడే, తదితరులు పాల్గొన్నారు.